BREAKING: లిక్కర్ కేసులో కీలక పరిణామం

BREAKING: లిక్కర్ కేసులో కీలక పరిణామం

AP: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, లిక్కర్ కేసులో నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో రాజమండ్రి జైలుకు, చెవిరెడ్డితో పాటు మిగిలిన నిందితులను విజయవాడ జైలుకు తరలించనున్నారు.