హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
GNTR: వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కంకరగుంటలోని ఓ వైన్స్ వద్ద స్వరూప్, శశికుమార్ అనే నిందితులు బాలకృష్ణ అనే వ్యక్తిపై దాడి చేశారు. భవనం పైనుంచి అతడిని తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. వైన్స్ సిబ్బంది అడ్డుకోవడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు.