VIDEO: బాధ్యతారాహిత్యం వల్లే ప్రమాదాలు: మంత్రి
NZB: బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్లో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు.