హైటెన్షన్ వైర్లకు తగిలి టిప్పర్‌లో మంటలు

హైటెన్షన్ వైర్లకు తగిలి టిప్పర్‌లో మంటలు

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని అహుడా లేఔట్ వద్ద సిమెంట్ ఖాళీ సంచులతో వెళ్తున్న టిప్పర్, గొల్లపల్లి బ్రిడ్జి వద్ద అన్‌లోడ్ చేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే గమనించి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో టిప్పర్ వెనుక టైర్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు.