విజయవాడలో ప్రజా దర్బార్
NTR: విజయవాడ 2, 3, 18 డివిజన్‌లలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజరైన టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలించారు. వాటిని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు సహకారంతో పరిష్కారం చేయిస్తామని ప్రజలకు హమీ ఇచ్చారు.