క్యాన్సర్‌తో ప్రముఖ నటి కన్నుమూత

క్యాన్సర్‌తో ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి డీ ఫ్రీమాన్ (66) చనిపోయింది. గత కొంతకాలంగా స్టేజ్ 4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచింది. 'ది యంగ్ అండ్ ది రెస్ట్‌లెస్', 'సిస్టాస్', 'సీన్‌ఫెల్డ్' వంటి పాపులర్ షోలతో ఆమె గుర్తింపు పొందింది. నటనలోకి రాకముందు అమెరికా మెరైన్ కార్ప్స్‌లో 6 ఏళ్లు పనిచేసి, జపాన్‌లో రేడియో డిజెగానూ రాణించింది.