మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి జైలుశిక్ష
VZM: మద్యం తాగి వాహనం నడుపుతూ ఎస్.కోట పోలీసులకు పట్టుబడిన నిందితుడికి ఏడురోజులు జైలుశిక్ష విధిస్తూ ఎస్.కోట ప్రత్యేక జ్యుడీషియల్ రెండవ శ్రేణి జడ్జి గండి అప్పలనాయుడు తీర్పు వెల్లడించినట్లు సీఐ వి.నారాయణమూర్తి సోమవారం తెలిపారు. ఎస్సై చంద్రశేఖర్ వివరాల మేరకు దత్తిరాజేరు గ్రామానికి చెందిన టీ.రమేష్ మద్యం సేవించి వాహన తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు.