పేకాట శిబిరంపై డ్రోన్లతో దాడి.. 6 మంది అరెస్ట్
గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడిలోని పొలాల్లో జూదం ఆడుతున్న 6 మందిని పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించి, అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 20,300ల నగదు, 5 చరవాణులు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు పారిపోయినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.