నేడు శనీశ్వర ఆలయంలో శని అమావాస్య వేడుకలు

SRD: ఝరాసంగం మండలం దత్తగిరి ఆశ్రమంలోని శనీశ్వర ఆలయంలో శని అమావాస్య వేడుకలు శనివారం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి 178 అవధూత గిరి మహారాజ్ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేష్ఠ దేవి సమేత శనీశ్వర విగ్రహానికి ఉదయం 5 గంటల నుంచి తైలాభిషేకాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.