దరఖాస్తులకు ఆహ్వానం
ASR: మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రాజెక్ట్ సంచాలకురాలు ఝాన్సీరాణి సోమవారం తెలిపారు. జిల్లాలోని బాలల రక్షణ విభాగంలో రెండు, వన్ స్టాప్ కేంద్రంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి 42 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఈనెల 25వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.