శ్రీకాంతాచారికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో శ్రీకాంత్ చారి పేరు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన త్యాగం, పోరాటం, ధైర్యం తెలంగాణ యువతకు ఎప్పటికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.