ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బెలుగుప్ప వంక

ATP: భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. బెలుగుప్ప వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్టర్లు, బస్సులు వంటి భారీ వాహనాలు నెమ్మదిగా వంకను దాటుతూ రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రజలు ఎవరూ వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని మండల అధికారులు హెచ్చరించారు.