కాలనీ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే
SKLM: నరసన్నపేట మండలం గడ్డయ్యపేట కాలనీ ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హామీ ఇచ్చారు. మంగళవారం మహిళలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. త్రాగునీరు, స్మశాన వాటిక స్థలం తక్షణమే కల్పించాలని మహిళలు డిమాండ్ చేశారు. స్మశాన వాటిక స్థలాన్ని మంజూరు చేస్తామని, త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.