మండల పరిషత్ ఆవరణను చెత్తతో నింపేస్తున్నారు..!
SRCL: వేములవాడ మండల పరిషత్ కార్యాలయాల ఆవరణను చెత్తతో నింపేస్తున్నారు. పశు వైద్యశాల వెనుక భాగంలో ఉన్న ప్రహరీ గోడపై నుంచి స్థానికులు నిత్యం చెత్తను వేస్తుండడంతో ఈ ప్రాంతం చెత్త కుప్పగా మారిపోయింది. చెత్తను సేకరించేందుకు ప్రతిరోజు మున్సిపల్ వాహనం వస్తున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చెత్తను ఇలా పడేయడం గమనార్హం.