మహా పడిపూజ కరపత్రాల ఆవిష్కరణ
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం గురువారం మహా పడిపూజ కరపత్రాలను నకిరేకల్‌లో ఆవిష్కరించారు. చిట్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహా మండల పడిపూజ మహోత్సవం జరగనుంది. ఈ మండల పూజలో వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్పలు అధిక సంఖ్యలో పాల్గొని, ఉత్సవాలను తిలకించి, స్వామివారి అనుగ్రహం పొందాలని స్వాములు కోరారు.