అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత
ASF: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను రెబ్బెన పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం SI వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖైర్గాం నుంచి రెబ్బెనకు ఇసుక తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి స్టేషన్‌కు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడిన డ్రైవర్ సాయిచరణ్, యజమాని తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.