BYPOLL: 20.76 శాతం పోలింగ్ పూర్తి @11AM
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోందని ఎన్నికల అధికారులు తెలిపారు. తాజాగా ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. సాయంత్రం వేళల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.