ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు సద్వినియోగం చేసుకోవాలి
SRCL: జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం, ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా పశువైద్య అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు జిల్లాలోని 13 మండలాల్లో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.