జిల్లా కలెక్టరేట్ ఎదుట బ్లాక్ డే నిరసన
ADB: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాలు 'బ్లాక్ డే' నిర్వహించాయి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన హోరెత్తించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలని కోరారు.