కోనసీమ కన్నా రాయలసీమ అద్భుతం: బండ్ల గణేశ్
KRNL: తిరుమల శ్రీవారి దర్శనార్థమై సంకల్పయాత్రలో భాగంగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇవాళ తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ కన్నా రాయలసీమ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. కర్నూలు, నంద్యాల మీదుగా పచ్చని పంట పొలాల నడుమ తన సంకల్పయాత్ర సాగిందన్నారు. కాగా, మరో 15ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని బండ్ల ఆశాభావం వ్యక్తం చేశారు.