కానిస్టేబుల్ ఆత్మహత్యపై సీపీ సజ్జనార్ స్పందన
SRD: ఆన్ లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల బాధ తాళలేక కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై అవగాహన కల్పించాల్సిన కానిస్టేబుల్ దానికే వ్యసనపరుడై ప్రాణాలు తీసుకోవడం బాధాకరమన్నరు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని, సమస్యకు చావు పరిష్కారం కాదన్నారు.