WWC FINAL: టాస్ ఓడిన టీమిండియా
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆలస్యం అయినప్పటికీ, మ్యాచ్‌ను పూర్తి 50 ఓవర్లు నిర్వహించనున్నారు. మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా విశ్వ విజేతగా నిలవాలని చూస్తోంది.