కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే కన్నా
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను మంగళవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. సత్తెనపల్లికి చెందిన పలు కీలక సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.