రోడ్డుపై బైఠాయించిన అయ్యప్ప స్వాములు
KDP: అట్లూరు క్రాస్ రోడ్డు సమీపంలో వివాదం నెలకొంది. శ్రీ అఖిలాండేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానం స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన గురుస్వామి నరసింహారెడ్డి తల పగలకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితునికి క్షమాపణలు చెప్పాలని, బద్వేల్-కడప మార్గంలో భైఠాయించి నిరసన తెలిపారు.