నిరుద్యోగ యువత వినియోగించుకోవాలి

మన్యం: ఎమ్మార్.నగరం పాలిటెక్నిక్ కళాశాలలో నిరుద్యోగ యువతకు శిక్షణ అందజేస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. చైతన్య తెలిపారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ వాయిస్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు శిక్షణ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 9లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.