ఆర్డీటీకి FCRA పునరుద్ధరణ హర్షణీయం: మంత్రి

ఆర్డీటీకి FCRA పునరుద్ధరణ హర్షణీయం: మంత్రి

సత్యసాయి: అనంతపురంలోని ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధుల సమీకరణకు అవసరమైన FCRA అనుమతిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడం హర్షణీయమని మంత్రి సవిత మంగళవారం తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్డీటీ గత 60 సంవత్సరాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదలకు విద్య, వైద్యం, గృహాలు వంటి సేవలు అందిస్తోందని ఆమె అన్నారు.