జిల్లాలో అభ్యుదయం సైకిల్ యాత్రకు స్పందన
VZM: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విశాఖ రేంజ్ పరిధిలో ప్రారంభమైన 'అభ్యుదయం' సైకిల్ యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో SP AR దామోదర్ పర్యవేక్షణలో సైకిల్ యాత్ర ఇవాళ ఎస్ కోట అనంతరం సాయంత్రానికి విజయనగరం చేరుకుంది. ఎస్ కోటలో ఎమ్మెల్యే లలిత కుమారి, పోలీస్ సిబ్బంది ఆహ్వానం పలికారు.