ఏపీ అభివృద్ధికి ఆకాశమే హద్దు: చంద్రబాబు
AP: వనరులు సమర్థంగా వాడుకుంటే ఏపీ అభివృద్ధికి ఆకాశమే హద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి అనేక కంపెనీలు వస్తున్నాయి.. పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు వస్తాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకరంగం కీలకపాత్ర కానుందని అన్నారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.