నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
MNCL: వేమనపల్లి మండల ప్రాణహిత నది నుంచి నెన్నెలకు తరలిస్తున్న 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ మంగళవారం తెలిపారు. నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, అగ్రికల్చరల్ అధికారుల ఆధ్వర్యంలో కృష్ణస్వామి, భాస్కర్, దుర్గయ్య, సాయికిరణ్‌ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు ACP వివరించారు.