కాంగ్రెస్ మహిళా టౌన్ అధ్యక్షురాలిగా రజితా

KNR: టౌన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా రజితా రెడ్డి నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సత్య ప్రసన్న రెడ్డి చేతుల మీదుగా రజితా రెడ్డి నియామక పత్రాలను అందుకున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు సత్య ప్రసన్న తెలిపారు. తన నియమకం పట్ల సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.