'అవాంఛనీయ ఘటనలు జరగకుండా పని చేయాలి'
ఖమ్మం జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FST), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SST) బృందాల పనితీరును ఆదివారం అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. తనిఖీ విధానాలు, క్షేత్రస్థాయి నిఘాపై సమీక్ష జరిపారు. ఎన్నికల మార్గదర్శకాలు పారదర్శకంగా అమలు అయ్యేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అధిక అప్రమత్తతతో పనిచేయాలని అన్నారు.