కారు డీలర్ దౌర్జన్యం.. తల్లి, కొడుకుకు గాయాలు..!
అన్నమయ్య: మదనపల్లిలో బాకీ డబ్బులు అడిగినందుకు తల్లి, కొడుకుపై కారు డీలర్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బసినికొండకు చెందిన నవీన్ కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, డీలర్ మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి దాడికి దిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు గాయపడిన నవీన్, ఆయన తల్లి పార్వతమ్మ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.