VIDEO: మర్రిపూడి మండలంలో వడగళ్ల వర్షం
ప్రకాశం: మర్రిపూడి మండలంలో సోమవారం వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కాగా అకస్మాత్తుగా వాతావరణం మార్పు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన వడగల్లు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఉపశమనం పొందారు.