ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
ఢిల్లీలో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఉగ్రవాదుల ఆదేశాల మేరకు పని చేస్తున్నట్లు గుర్తించారు. గ్యాంగ్ స్టర్ షాజాద్ భట్టి నేతృత్వంలోని మాడ్యూల్స్‌కు చెందిన ఈ ముగ్గురు నిందితులు ఇటీవల గురుదాస్‌పూర్ పీఎస్ ముందు హ్యాండ్ గ్రేనేడ్‌ను విసిరినట్లు అధికారులు తెలిపారు.