సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మండలంలో గల బూరగాం గ్రామానికి చెందిన కృష్ణవేణి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆమె సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసింది. మంజూరైన రూ. 5లక్షల నగదు చెక్కును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందన్నారు.