న్యాయమూర్తిపై అభిశంసనకు ప్రభుత్వం సన్నద్ధం!
తమిళనాడు తిరుపరంకుండ్రంలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో నిర్వహించే దీపోత్సవంపై వివాదం తలెత్తింది. కొండపై ఉన్న దర్గ సమీపంలోని పురాతన స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ వివాదాస్పద తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయమూర్తిపై అభిశంసించాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.