'464 దరఖాస్తులు వచ్చాయి'

'464 దరఖాస్తులు వచ్చాయి'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు 464 మంది కొత్త రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారని మండల వ్యవసాయ అధికారి సంగీత తెలిపారు. గురువారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ.. మండలంలోని ఐదు క్లస్టర్ పరిధిలో ఉన్న రైతు వేదికలకు కొత్త రైతులు వచ్చి దరఖాస్తులు సమర్పించారన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఆమె వెల్లడించారు.