నేడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి
ప్రకాశం: దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఇవాళ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శిస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయింది. ఉదయం 8:30 గంటలకు వెలుగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు