విద్యను వ్యాపారం చేస్తున్నారు: విద్యార్థి సంఘాలు

విద్యను వ్యాపారం చేస్తున్నారు: విద్యార్థి సంఘాలు

హన్మకొండ ప్రెస్ క్లబ్‌లో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని నేతలు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉందని, ఫీజుల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.