VIDEO: జంబులబండలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం
సత్యసాయి: గుడిబండ మండలం జంబులబండ గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మడకశిర ఎమ్మెల్యే ఎం.యస్. రాజు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో రెండు చోట్ల బోర్లు వేయించగా, రెండు ప్రాంతాల్లో కూడా పుష్కలంగా నీరు లభించింది. దీంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.