VIDEO: ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలి
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో ఈనెల 23న ధర్మయుద్ధ సభను నిర్వహిస్తున్నట్లు తుడుం దెబ్బ ఆదివాసి పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ తెలిపారు. శనివారం పట్టణంలోని కొమరం భీం కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టబద్ధతలేని లంబడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.