వైభవంగా శ్రీవారి కల్యాణం

వైభవంగా శ్రీవారి కల్యాణం

SDPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. పద్మావతి, గోదాదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక వేదికపై అలంకరించి వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.