కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కృష్ణా: బాపులపాడు మండలం వేలేరులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. TDP రాష్ట్ర రైతు కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సురేష్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. TDP నాయకులు శివ నాగమళ్ళేశ్వరరావు స్వామి,విజయ్, సతీష్, నాని పాల్గొన్నారు.