శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

HYD: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. CISF, స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్లు ముమ్మర తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. మెయిల్ ఫేక్‌గా తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. RGIA పోలీసులు మెయిల్ మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.