ఆభరణాలకు మెరుగు పేరుతో మోసం!
SRCL: వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. బీహారికి చెందిన రాజేశ్ కుమార్, కన్నయ్య కుమార్ ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్‌కు చెందిన మాన్య లక్ష్మీ, పద్మ, ప్రేమల, సత్తవ్వల వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని ఆసిడ్‌లో వేశారు. రసాయనాలతో వెండిని కరిగించి తరుగు వచ్చేలా చేశారని తెలిపారు.