జాతీయస్థాయిలో ఎంపికైన వెల్గటూర్ విద్యార్థిని
JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని శ్రీనిత్య ఇస్రో యువిక ప్రోగ్రాంలో జాతీయ స్థాయిలో ఎంపికైంది. సైన్స్‌పై ఆసక్తితో కృషి చేసిన ఆమెను టీచర్లు ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా 456 మందిలో తెలంగాణ నుంచి ఎంపికైన 15 మందిలో ఆమె ఒకరు కావడం విశేషం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందింది.