ప్రమాదం అంచున జలాశయం.. రాకపోకలు బంద్

ప్రమాదం అంచున జలాశయం.. రాకపోకలు బంద్

TG: అల్ప పీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో పోచారం జలాశయం ప్రమాదపు అంచున ఉందని స్థానికులు తెలిపారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా జలాశయంపై సుమారు 8 అడుగుల మేర వరద ప్రవహించడంతో ప్రమాద ఘంటికలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాకపోకలు స్తంభించాయి. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.