వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: బయ్యారం మండలం కొత్తపేట గంధంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. సాగు చేసే ప్రతి రైతుకు ఎరువులు సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రెండో పంట సాగుకు ఎరువులు పట్టాలు లేని రైతులకు కూడా అందజేశామన్నారు.