'బీర్కూరులో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే'

'బీర్కూరులో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే'

కామారెడ్డి: జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్‌ను గెలిపించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానుందని చెప్పారు. కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.