పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం
CTR: పుంగనూరు మండల సర్వసభ్య సమావేశం బుధవారం MPP భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఈ మేరకు యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారని, త్వరతగతిన పంపిణీ చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు.